Hairtail Fish: ఇదేం చేప... తళతళా మెరిసిపోతోంది!

  • హెయిర్ టెయిల్ ఫిష్ చేప వీడియోను పంచుకున్న ఓ నెటిజన్
  • 24 గంటల్లో 97 లక్షల వ్యూస్
  • అత్యంత ఆకర్షణీయంగా ఉన్న చేప
Hairtail fish video went viral on social media

సోషల్ మీడియాలో ఓ చేపకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వెండిని పాలిష్ చేస్తే ఎంతలా తళతళలాడిపోతుందో ఈ చేపను చూస్తే అలా అనిపిస్తుంది. దీని పేరు హెయిర్ టెయిల్ ఫిష్. ప్రపంచవ్యాప్తంగా ఇది శీతల ప్రాంతాల్లో తప్ప మిగిలిన అన్ని సముద్ర జలాల్లో కనిపిస్తుంది. తెల్లగా, గాజులా మెరిసిపోయే దేహంతో ఈ చేప అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. దీని వీపుపై ఉండే రెక్క ఎంతో పారదర్శకంగా కనిపిస్తుంది. 

ఈ హెయిర్ టెయిల్ ఫిష్ వీడియోను ఫిజెన్ అనే నెటిజన్ జులై 3న ట్విట్టర్ లో పంచుకోగా, ఇప్పటివరకు 9.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో 78 వేల లైకులు, 9 వేలకు పైగా రీట్వీట్లు సొంతం చేసుకుంది.

More Telugu News