Maharashtra: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

  • మహారాష్ట్రలోని ధులే జిల్లాలో ప్రమాదం
  • ట్రక్కు బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయిన డ్రైవర్
  • బైక్స్, కారు, కంటైనర్ పైకి దూసుకెళ్లిన ట్రక్కు
Massive road accident claims 10 lives while more than 20 injured in Dhule

మహారాష్ట్రలోని ధులే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముంబైకి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధులే జిల్లాలోని పలస్నేర్ గ్రామ సమీపంలో గల ముంబై-ఆగ్రా జాతీయ రహదారిపై ఉదయం 10.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఓ ట్రక్కు బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, దీంతో ఆ ట్రక్కు బీభత్సం సృష్టించిందని తెలిపారు. రెండు మోటార్ సైకిల్స్, ఒక కారు, మరో కంటైనర్ ను ట్రక్ ఢీకొట్టింది. ఆ తర్వాత జాతీయ రహదారిలోని బస్టాప్ సమీపంలో గల హోటల్‌లోకి దూసుకెళ్లి బోల్తా పడింది.

ఈ ఘటనలో 10 మంది మృత్యువాత పడ్డారని, ఇరవై మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ట్రక్కు మధ్యప్రదేశ్ నుండి ధులే వైపు వెళ్తోంది. బస్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న కొంతమంది కూడా ఈ ప్రమాద బాధితుల్లో ఉన్నారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని, క్షతగాత్రులను శిర్పూర్, ధులేలోని ఆసుపత్రులకు తరలించారు.

More Telugu News