Somu Veerraju: మీ టర్మ్ అయిపోయింది.. రాజీనామా చేయండి: సోము వీర్రాజుకు జేపీ నడ్డా ఫోన్

JP Nadda asks Somu Veerraju to resign
  • ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు తొలగింపు
  • కొత్త అధ్యక్షుడిగా సత్యకుమార్ ను నియమించే అవకాశం
  • వీర్రాజుకు ఇతర బాధ్యతలను అప్పగించనున్నట్టు సమాచారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పార్టీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి ఆయనను తొలగించింది. సోము వీర్రాజుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేరుగా ఫోన్ చేశారు. అధ్యక్షుడిగా మీ టర్మ్ పూర్తి అయిందని... పదవికి రాజీనామా చేయాలని వీర్రాజుకు నడ్డా సూచించారు. ఏపీ నూతన అధ్యక్షుడిగా సత్యకుమార్ ను నియమించనున్నట్టు సమాచారం. వీర్రాజుకు ఇతర బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News