poonam kaur: నీతులు చెప్పి.. జీవితాలతో ఆడుకునే వాడు గురువు కాదు: పూనమ్ కౌర్

poonam kaur viral comments guruvu

  • గురుపూర్ణిమ సందర్భంగా ఇన్ స్టా స్టోరీ షేర్ చేసిన పూనమ్
  • ప్రతి ఒక్కరినీ గురువు అని పిలవద్దని సూచన
  • మీకు దారి చూపించేవారు గురువు అవుతారని వ్యాఖ్య

పూనమ్ కౌర్.. నటిగా కంటే వివాదాలతో ఎక్కువ ఫేమస్ అయ్యారు. తరచుగా ఈమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు వైరల్ అవుతుంటాయి. ప్రధానంగా ఓ ఇద్దరు ప్రముఖులను పరోక్షంగా టార్గెట్ చేసినట్లు ఉంటాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసిన స్టోరీ వైరల్ అవుతోంది.

గురుపూర్ణిమ సందర్భంగా ఇన్ స్టా స్టోరీ షేర్ చేసిన పూనమ్.. ‘‘మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి టామ్, డిక్ అండ్ హారీని.. గురువు అని పిలవద్దు. నీతులు చెప్పి స్టేజ్ మీద జీవితాలతో ఆడుకునే వాడు గురువు కాదు. మీకు దారి చూపించేవారు గురువు అవుతారు” అని రాసుకొచ్చింది.

దీంతో ఆమె ఎవరి గురించి రాశారు? ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఎవరికి సలహాలిస్తున్నారు? అంటూ పూనమ్‌ పోస్ట్‌పై చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్‌లో ఓ ప్రముఖ డైరెక్టర్‌‌ను గురూజీ అని పిలుస్తారు. ఆయన్నే టార్గెట్ చేసుకుని పూనమ్ విమర్శలు చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


poonam kaur
guruvu
guru poornima
Instagram
  • Loading...

More Telugu News