Roja: పవన్ ఇరిటేషన్ స్టార్.. బాబు ఇమిటేషన్ స్టార్.. జగన్ ఇన్స్పిరేషన్ స్టార్: రోజా

  • రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులను తిరగరాయాలన్నా జగన్ కే సాధ్యమన్న రోజా
  • జగన్ వెంట్రుకను కూడా బాబు, పవన్ పీకలేరని ఎద్దేవా
  • జగన్ ను మరోసారి సీఎం చేసేందుకు ప్రజలు కసితో ఉన్నారని వ్యాఖ్య
Roja comments on Chandrababu and Pawan Kalyan

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ ఇరిటేషన్ స్టార్, చంద్రబాబు ఇమిటేషన్ స్టార్ అని విమర్శించారు. సీఎం జగన్ ఇన్స్పిరేషన్ స్టార్ అని అన్నారు. రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులను తిరగరాయాలన్నా జగన్ కే సాధ్యమని చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సీఎం జగన్ కాలు మీద వెంట్రుక కూడా పీకలేరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'హాయ్ ఏపీ.. బైబై బీపీ (బాబు, పవన్).. వన్స్ అగైన్ వైఎస్సార్సీపీ' అని అన్నారు. 

ఇచ్చిన మాట కోసం విజయ డెయిరీని జగన్ పునఃప్రారంభిస్తున్నారని రోజా అన్నారు. చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థ కోసం విజయ డెయిరీని మూయించారని ఆరోపించారు. ప్రజలందరూ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న విజయ డైయిరీకి జగన్ ప్రాణం పోస్తున్నారని చెప్పారు. జగన్ ను మరోసారి సీఎం చేసేందుకు ప్రజలు కసితో ఉన్నారని అన్నారు.

More Telugu News