Hyderabad: మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళలపైకి దూసుకెళ్లిన కారు.. హైదరాబాద్ లో తల్లీకూతుళ్లు సహా ముగ్గురి మృతి

Speeding car rams into morning walkers in Hyderabad
  • బండ్లగూడలో బీభత్సం సృష్టించిన కారు
  • ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు మహిళలు
  • అతివేగమే కారణమని స్థానికుల ఆరోపణ
హైదరాబాద్ లోని బండ్లగూడలో మంగళవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళలపైకి దూసుకెళ్లింది. బండ్లగూడ జాగీర్ సన్ సిటీ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

మంగళవారం ఉదయం హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై అదుపు తప్పిన కారు.. రోడ్డు పక్కన మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళలపైకి దూసుకెళ్లింది. దీంతో మార్నింగ్ వాక్ కు వచ్చిన అనురాధ, మమతలతో పాటు మరో మహిళ అక్కడికక్కడే చనిపోయారు. మరో ఏడుగురు మహిళలకు గాయాలయ్యాయి. అక్కడి పరిస్థితి భయానకంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Hyderabad
car accident
morning walkers
bandlaguda

More Telugu News