Pakistan: భారతీయుడిపై ప్రేమ.. పిల్లల్ని తీసుకుని ఇండియాకు వచ్చేసిన పాకిస్థానీ వివాహిత

Pak Woman Meets Noida Man While Playing PUBG Comes To India With 4 Kids
  • ఆన్‌లైన్‌లో పబ్‌జీ గేమ్ ఆడే క్రమంలో ఉత్తరప్రదేశ్ వ్యక్తితో పరిచయం
  • పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ప్రియుడితో కలిసుండాలని కోరుకున్న పాకిస్థానీ మహిళ
  • నేపాల్ మీదుగా ఇండియాలో కాలుపెట్టిన వైనం
  • గ్రేటర్ నోయిడాలో ప్రియుడితో కలిసి కాపురం
  • తాజాగా వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు
భారతీయుడితో ప్రేమలో పడ్డ ఓ పాకిస్థానీ వివాహిత తన నలుగురు పిల్లల్నీ తీసుకుని ఇండియాకు వచ్చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో అక్రమంగా నివసిస్తున్న వీరిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే, స్థానికంగా నివసించే ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో పబ్‌జీ ఆడుతుండగా పాకిస్థానీ వివాహితతో పరిచయమైంది. ఆ పరిచయం చివరకు ప్రేమగా మారింది. ప్రియుడితో కలిసుండాలని కోరుకున్న ఆమె తన నలుగురు పిల్లలను తీసుకుని ఇండియా వచ్చేసింది. నేపాల్ మీదుగా ఆమె అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిందని పోలీసులు తెలిపారు. 

గత నెలలో ఉత్తరప్రదేశ్ చేరుకున్న ఆమె అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రియుడి చెంతకు చేరుకుందని చెప్పారు. స్థానికంగా ఓ అద్దె అపార్టుమెంటులో నివసించడం ప్రారంభించారు. ఈ ఉదంతం తాలూకు సమాచారం పోలీసులకు చేరడంతో వారు ఆ కుటుంబాన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా, మహిళను చూస్తే పాకిస్థాన్ నుంచి వచ్చినట్టు అస్సలు అనుమానం కలగలేదని ఇంటి ఓనర్ చెప్పడం గమనార్హం.
Pakistan
India
Uttar Pradesh

More Telugu News