KTR: దేశీయ ఉత్పత్తుల వినియోగం పెరగాలి: కేటీఆర్

Minister KTR on country made products
  • స్పేస్ రాకెట్ రంగంలో రికార్డ్ సృష్టించామన్న మంత్రి
  • దిగుమతులు తగ్గించుకోవాలని సూచన
  • ఉత్పత్తి రంగంలో చైనాతో పోటీ పడాలన్న కేటీఆర్
దేశీయ ఉత్పత్తుల వినియోగం పెరగాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.  స్పేస్ రాకెట్ రంగంలో మనం రికార్డ్ సృష్టించామన్నారు. దేశీయ అవసరాల కోసం కావాల్సిన ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవాలని సూచించారు. ఉత్పత్తి రంగంలో చైనాతో మనం పోటీ పడాలన్నారు. కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు. చంద్రబాబు, వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కంటే కేసీఆర్ హయాంలోనే తెలంగాణలో ఎక్కువ అభివృద్ధి జరిగిందన్నారు.
KTR
Telangana

More Telugu News