KCR: ప్రగతి భవన్ లో ముగిసిన కేసీఆర్, అఖిలేశ్ యాదవ్ భేటీ

Meeting between CM KCR and SP Chief Akhilesh Yadav concluded
  • హైదరాబాద్ వచ్చిన అఖిలేశ్
  • సీఎం కేసీఆర్ తో దాదాపు 4 గంటల పాటు భేటీ
  • ఇటీవల లక్నోలోనూ సమావేశమైన కేసీఆర్, అఖిలేశ్ 
సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ నేడు హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మధ్యాహ్నం ఆయన సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. ప్రగతి భవన్ లో వీరిద్దరి భేటీ కొద్దిసేపటి కిందట ముగిసింది. కేసీఆర్, అఖిలేశ్ మధ్య సమావేశం దాదాపు 4 గంటల పాటు సాగింది. మొన్న లక్నోలోనూ ఇరువురు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఇటీవలి కర్ణాటక ఎన్నికల ఫలితాలు, త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. తాజా సమావేశంలోనూ రాజకీయ పరిణామాలపై లోతైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
KCR
Akhilesh Yadav
Pragathi Bhavan
Hyderabad
Telangana
Uttar Pradesh

More Telugu News