విపక్ష నేతలను కలిసిన అఖిలేశ్ ఈరోజు కేసీఆర్‌ను కలిశారు: కిషన్ రెడ్డి
- అఖిలేశ్, కేసీఆర్ భేటీతో ఎవరికి ఎవరు బీ టీమో తెలుస్తుందని వ్యాఖ్య
- కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీలేనని విమర్శ
- ఈ రెండు పార్టీలు గతంలో పొత్తు పెట్టుకున్నాయన్న కేంద్రమంత్రి
మరోపక్క, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుండి పారిపోయిన వ్యక్తి అని ఎద్దేవా చేశారు. అలాంటి రాహుల్ కు బీజేపీని విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. తమ పార్టీకి కాంగ్రెస్, బీఆర్ఎస్.. రెండు సమదూరంలోనే ఉన్నాయన్నారు. తాము బీఆర్ఎస్ తో గతంలో కలవలేదని, భవిష్యత్తులోను కలిసే పరిస్థితి లేదన్నారు. కుటుంబ పాలన, అవినితిపై బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు.