Akhilesh Yadav: హైదరాబాద్‌కు అఖిలేశ్ యాదవ్, సీఎం కేసీఆర్‌తో భేటీ

Akhilesh Yadav meets CM KCR in Pragathi Bhavan
  • ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అఖిలేశ్
  • విమానాశ్రయంలో స్వాగతం పలికిన మంత్రులు
  • అక్కడి నుండి నేరుగా ప్రగతి భవన్ కు అఖిలేశ్
సమజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న అఖిలేశ్... బేగంపేట విమానాశ్రయం నుండి నేరుగా ప్రగతి భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా అఖిలేశ్‌కు కేసీఆర్ సాదర స్వాగతం పలికారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించుకున్నారు. బేగంపేట విమానాశ్రయం చేరుకున్న అఖిలేశ్ కు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలు ఘన స్వాగతం పలికారు.
Akhilesh Yadav
KCR

More Telugu News