Kotla Suryaprakash Reddy: చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది: కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

Kotla Suryaprakash Reddys comments on Chandrababu
  • చంద్రబాబు ఉంటేనే రాయలసీమ కష్టాలు తొలగిపోతాయన్న కోట్ల
  • సాగు, తాగు నీటి కష్టాలు పోవాలంటే ఆయన మళ్లీ సీఎం కావాలని వ్యాఖ్య
  • టీడీపీ కార్యకర్తలను పోలీసులు కావాలనే వేధిస్తున్నారని మండిపాటు
కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు. కర్నూలులో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు సీఎంగా ఉంటేనే రాయలసీమ కష్టాలు తొలగిపోతాయి. సాగు, తాగు నీటి కష్టాలు పోవాలంటే ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలి” అన్నారు. టీడీపీ కార్యకర్తలను పోలీసులు కావాలనే వేధిస్తున్నారని మండిపడ్డారు.
Kotla Suryaprakash Reddy
Chandrababu
TDP

More Telugu News