Nagashourya: ఈ వారం థియేటర్స్ కి వస్తున్న తెలుగు సినిమాలివే!

  • ఈ నెల 7వ తేదీన రిలీజ్ కి రెడీగా ఆరు సినిమాలు 
  • ముందు వరుసలో నిలిచిన 'రంగబలి'
  • ఆ తరువాత స్థానంలో ఉన్న 'భాగ్ సాలే'
  • 'రుద్రంగి' పై కూడా పెరిగిన అంచనాలు
New Movies Update

టాలీవుడ్ లో ఈ వారం థియేటర్ల దగ్గర సందడి కాస్త గట్టిగానే కనిపించనుంది. ఈ వారం .. అంటే ఈ నెల 7వ తేదీన దాదాపు అరడజను సినిమాలు లైన్ పైకి వస్తున్నాయి. ఆ జాబితాలో నాగశౌర్య 'రంగబలి' ముందువరుసలో కనిపిస్తోంది. పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో, కథానాయికగా యుక్తి తరేజా పరిచయమవుతోంది. సింహా కోడూరి హీరోగా చేసిన 'భాగ్ సాలే' సినిమా కూడా ఈ నెల 7వ తేదీనే థియేటర్లలో దిగిపోనుంది. నేహా సోలంకి కథానాయికగా నటించిన ఈ సినిమాతో, దర్శకుడిగా ప్రణీత్ పరిచయమవుతున్నాడు. ఇక అదే రోజున వస్తున్న 'రుద్రంగి' సినిమాపై కూడా అందరిలో ఆసక్తి ఎక్కువగానే ఉంది. జగపతిబాబు విలనిజం ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుంది. ఆ తరువాత వరుసలో 'ఓ సాథియా' .. 'సర్కిల్' .. '7:11' సినిమాలు కనిపిస్తున్నాయి. ఈ మూడు సినిమాలు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందాయి. ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ తో ఆసక్తిని పెంచాయి. చూడాలి మరి ఈ అరడజను సినిమాల్లో ఏది ఎన్ని మార్కులు కొట్టేస్తుందో .. ఏది ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో. 

More Telugu News