Andhra Pradesh: ఏపీకి మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్.. ఈ నెల 7 నుంచి సర్వీసులు ప్రారంభం

  • విజయవాడ - చెన్నై నగరాల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్
  • 8వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో సర్వీసులు
  • ఒకట్రెండు రోజుల్లో వెల్లడి కానున్న టికెట్ ధరలు, రాకపోకల షెడ్యూల్ వివరాలు
Vijayawada Chennai Vande Bharat Express

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రానికి మరో వందేభారత్ రైలు వస్తోంది. విజయవాడ-చెన్నై నగరాల మధ్య ఈ నెల 7 నుంచి వందేభారత్ రైలు రాకపోకలు మొదలు కానున్నాయి. దేశ వ్యాప్తంగా ఐదు వందే భారత్ రైళ్లను మోదీ ప్రారంభించనున్నారు. ఇందులో విజయవాడ- చెన్నై మధ్య నడిచే రైలు ఒకటి. ఈ నెల 8 నుంచి రైలు సర్వీసులు పూర్తి స్థాయిలో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ రైలు ఏయే స్టేషన్లలో ఆగుతుంది, రాకపోకల షెడ్యూల్, టికెట్ ధరలు తదితర వివరాలను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. విజయవాడ-రేణిగుంట మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని రేణిగుంట మీదుగా రైలును నడపాలని విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు కోరినట్టు తెలుస్తోంది. 

More Telugu News