సింహాచలంలో కొనసాగుతున్న గిరిప్రదక్షిణ.. భక్తజన సంద్రంతో కిక్కిరిసిన సింహాద్రి గిరులు

Simhachalam Giri Pradakshina Continuous
  • నిన్న సాయంత్రం మొదలైన గిరి ప్రదక్షిణ
  • తెలంగాణ సహా పలు రాష్ట్రాల నుంచి భక్తుల రాక
  • గోవింద నామస్మరణతో మార్మోగుతున్న సింహాద్రి గిరులు
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సింహాచలంలో నిన్న సాయంత్రం ప్రారంభమైన గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఈ ఉదయం సింహాద్రి గిరులు కిక్కిరిసిపోయాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణ, ఒడిశా నుంచి కూడా వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. 

గోవింద నామస్మరణతో గిరి ప్రదక్షిణ మార్గాలు మార్మోగుతున్నాయి. ఈ ఉదయం ఏడు గంటల ప్రాంతంలో పాతగోశాల టీ జంక్షన్ వద్ద రద్దీ మరింత ఎక్కువగా కనిపించింది. వరాహ లక్ష్మీనరసింహస్వామిని స్మరించుకుంటూ భక్తులు ముందుకు సాగుతున్నారు.
Go Back to Shorts
Simhachalam
Varaha Lakshmi Narasimha swamy temple
Simhachalam Giri Pradakshina

More Telugu News