Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ... భారీగా హుండీ ఆదాయం

  • వారాంతం కావడంతో తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు
  • సర్వదర్శనానికి 24 గంటల సమయం
  • పూర్తిగా నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్
  • నిన్న ఒక్కరోజే స్వామివారికి రూ.4.27 కోట్ల ఆదాయం
Huge rush in Tirumala shrine

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో వారాంతం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నుంచి ఇక్కడ భారీ రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. 

టోకెన్లు లేకుండా క్యూ లైన్లలోకి వచ్చిన భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఒకరోజు పాటు భక్తులు క్యూ లైన్లలో ఉండాల్సి వస్తుండడంతో, టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. కిచిడి, ఉప్మా, పెరుగన్నం, బిసిబేళా బాత్, పాలు, మజ్జిగ అందిస్తోంది. 

నిన్న తిరుమల శ్రీవారిని 82,999 మంది దర్శించుకున్నారు. 38,875 మంది తలనీలాల మొక్కు తీర్చుకున్నారు. 

మరోసారి తిరుమల వెంకన్నకు హుండీ రూపంలో భారీ ఆదాయం లభించింది. నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.4.27 కోట్ల ఆదాయం లభించింది.

More Telugu News