Yogi Adityanath: ఫ్రాన్స్ అల్లర్లను యోగి 24 గంటల్లోనే కట్టడి చేయగలరు.. వైరల్ అవుతున్న ట్వీట్‌పై అసదుద్దీన్ సెటైర్!

  • 17 ఏళ్ల కుర్రాడి కాల్చివేతతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్
  • దేశవ్యాప్తంగా చెలరేగిన అల్లర్లు
  • అది నకిలీ ట్వీట్ అంటున్న నెటిజన్లు
  • అసదుద్దీన్ సెటైర్
Burning France yearning for Yogi Model UP CMs office Responds

17 ఏళ్ల కుర్రాడి కాల్చివేత తర్వాత ఫ్రాన్స్ అట్టుడుకుతోంది. నిరసనకారుల అల్లర్లతో రణరంగాన్ని తలపిస్తోంది. బాధ్యుడైన పోలీసు క్షమాపణలు చెప్పినా నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు. అల్లర్లు రోజురోజుకు దేశమంతా వ్యాపిస్తున్నాయి. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ అల్లర్లను అదుపు చేసే శక్తి ఒక్క యోగి ఆదిత్యనాథ్‌కు మాత్రమే ఉందంటూ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. జర్మనీకి చెందిన ప్రొఫెసర్, కార్డియాలజిస్ట్ ఎన్. జాన్‌కామ్ ట్వీట్ చేసినట్టుగా ఉన్న ఇందులో.. ఫ్రాన్స్ అల్లర్లను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 24 గంటల్లోనే కట్టడి చేయగలరని రాసుకొచ్చారు. 

ఈ ట్వీట్‌పై యోగి కార్యాలయం స్పందించింది. ప్రపంచంలో ఎక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలిగినా యోగి మోడల్‌ను అనుసరించడం ద్వారా వాటిని కట్టడి చేయవచ్చని ట్వీట్ చేసింది. నెటిజన్లు మాత్రం ఈ ట్వీట్ నకిలీదని, చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన డాక్టర్ నరేంద్ర విక్రమాదిత్య యాదవ్‌కు చెందినదంటూ కామెంట్ చేస్తున్నారు.

వైరల్ అవుతున్న ఈ ట్వీట్‌పై యోగి కార్యాలయం స్పందించడాన్ని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. విదేశీయుల ప్రశంసల కోసం బీజేపీ తహతహలాడుతోందని సెటైర్ వేశారు. ట్వీట్ చేసిన వ్యక్తి ట్విట్టర్ ఖాతా నకిలీదని కూడా గుర్తించలేకపోయారని ఎద్దేవా చేశారు.

More Telugu News