Iswarya Menon: స్పై హీరోయిన్ కు జాక్ పాట్.. పవన్ సరసన అవకాశం!

  • నిఖిల్ హీరోగా వచ్చిన స్పై సినిమాలో మెప్పించిన ఐశ్వర్య మీనన్
  • పవన్, సుజీత్ కాంబినేషన్లలో వస్తున్న ఓజీ
  • ఒక హీరోయిన్ గా ఐశ్వర్యను తీసుకున్నట్టు ప్రచారం
SPY Heroine Gets Call From OG

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓజీ (ఓజస్ గంభీర) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంపై ఇప్పటికే టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఈ చిత్రం తారాగణం పెద్దగానే ఉంది. బాలీవుడ్ నటులు ఇమ్రాన్ హష్మి, ప్రకాశ్ రాజ్, తమిళ నటుడు అర్జున్ దాస్, శ్రేయా రెడ్డి తదితరులు నటిస్తున్నారు. పవన్ సరసన హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోషన్ ను తీసుకున్నారు. తాజాగా ఈ చిత్రంలోకి మరో యువ నటిని తీసుకున్నట్టు తెలుస్తోంది. 

నిఖిల్ హీరోగా వచ్చిన స్పై సినిమా హీరోయిన్ ఐశ్వర్యా మీనన్ కు ఆ అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. కేరళకు చెందిన ఐశ్వర్యా మీనన్ 2012లో విడుదలైన తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘లవ్ ఫెయిల్యూర్‌’తో టాలీవుడ్ కు పరిచయం అయింది. దాదాపు ఒక దశాబ్దం తర్వాత, నిఖిల్ సిద్ధార్థ్‌ తో కలిసి పూర్తి స్థాయి హీరోయిన్ గా  స్పై లో నటించింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన రాగా.. ఐశ్వర్యా మీనన్ తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా యువతను ఆకట్టుకుంది. దాంతో, ఓజీ నుంచి  ఆమెకు చాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More Telugu News