Twitter: ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల ట్విట్టర్ సేవలకు అంతరాయం

Twitter down for several users across world
  • ట్వీట్లను యాక్సెస్ చేయలేకపోయిన యూజర్లు
  • ఎలాన్ మస్క్ కు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు
  • ట్విట్టర్ డౌన్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ సేవలకు అంతరాయం ఏర్పడింది. వెబ్, ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లు ట్వీట్లను యాక్సెస్ చేయలేకపోయారు. కొంతమంది ట్వీట్ చేయగా రేట్ లిమిట్ ఎక్సీడెడ్ అని వస్తోంది. దీంతో ఎలాన్ మస్క్ కు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 

రెండు గంటలుగా ఈ సమస్య నెలకొందని డౌన్ డిటెక్టర్ వెబ్ సైట్ పేర్కొంది. ట్విట్టర్ సేవలకు అంతరాయం నేపథ్యంలో ట్విట్టర్ డౌన్ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ అంతరాయంపై ట్విట్టర్ స్పందించాల్సి ఉంది.
Twitter

More Telugu News