Eatala Rajendar: బీజేపీకి ఇవాళ ప్రజల ఆశీర్వాదం దొరికే సందర్భం ఆసన్నమైంది: ఈటల

Eatala Rajendar says he will work for BJP like a solider under Modi leadership
  • పార్టీ మారనున్నారంటూ ఈటలపై ప్రచారం
  • ఎప్పటికప్పుడు బీజేపీ పట్ల విధేయత చాటుకునే ప్రయత్నం చేస్తున్న ఈటల
  • తాజాగా ఓ ప్రకటన విడుదల
  • మోదీ నాయకత్వంలో ఓ సైనికుడిలా పనిచేస్తానని వెల్లడి
పార్టీ మారే అవకాశాలున్నాయంటూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సందర్భం వచ్చినప్పుడల్లా ఖండిస్తూనే ఉన్నారు. బీజేపీ పట్ల తన విధేయతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

తాజాగా ఆయన తాను బీజేపీలో ఉంటానని పరోక్షంగా చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ కార్యకర్తలు, నేతలు, సర్పంచి నుంచి పార్లమెంట్ సభ్యుని దాకా గెలవాలని 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో అనేక కష్టనష్టాలకోర్చారని, అవమానాలు భరించారని, త్యాగాలు చేశారని వెల్లడించారు. పదవులు లేకపోయినా కాషాయ జెండా పట్టి కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారని ఈటల వివరించారు. 

బీజేపీకి ఇవాళ ప్రజల ఆశీర్వాదం దొరికే సందర్భం ఆసన్నమైందని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో బీజేపీని గెలిపించాలనే ఆశను సఫలం చేయడంలో ప్రజల ఆశీర్వాదంతో ఒక సైనికుడిలా పనిచేస్తా... మీకు అండగా ఉంటా అంటూ బీజేపీ శ్రేణులను ఉద్దేశించి స్పష్టం చేశారు.
Eatala Rajendar
BJP
Narendra Modi
Telangana

More Telugu News