BJP: టైమ్స్ నౌ నవభారత్ సర్వే: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితం ఇదే!

Timesnow navbharat survey on who would win if loksabha polls were to be held now
  • ‘జన్‌గణ్‌ కా మన్’ పేరిట టైమ్స్ నౌ- నవ్‌భారత్ సర్వే
  • ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చే ఫలితాలపై జనాభిప్రాయ సేకరణ
  • జాతీయ స్థాయిలో బీజేపీకి 285-325 స్థానాలు
  • కాంగ్రెస్ కూటమికి 111-149 సీట్లు
  • తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీకి మెజారిటీ సీట్లు
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశంలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఈసారి గెలుపెవరిదో అన్న చర్చ ప్రజల్లో ప్రారంభమైంది. బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందా? లేక ప్రతిపక్షాల కూటమి బీజేపీని మట్టికరిపిస్తుందా? అన్నవి మిలయన్ డాలర్ల ప్రశ్నలుగా మారాయి. అసలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపెవరిదీ అనే ఆసక్తికర ప్రశ్నకు జాతీయ మీడియా సమాధానం వెతికే ప్రయత్నం చేసింది. ‘జన్‌గణ్‌ కా మన్’ పేరిట టైమ్స్ నౌ- నవ్‌భారత్ జరిపిన ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

జాతీయ స్థాయిలో మూడోసారి బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఈ సర్వేలో తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి 285 నుంచి 325 సీట్లు సాధిస్తుందట. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ 111 నుంచి 149  సీట్లకే పరిమితమవుతుందని సర్వే తేల్చింది. 

బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ మరోసారి విజయఢంకా మోగిస్తుందని సర్వేలో తేలింది. పశ్చిమ బెంగాల్‌లో 20 నుంచి 22 సీట్లు టీఎంసీ కైవసం చేసుకుంటుందట. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ 12-14 సీట్లు, ఢీల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 4-7  సీట్లు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సారథ్యంలో సమాజ్ వాదీ పార్టీ 4-8 సీట్లు సాధిస్తాయని పేర్కొంది. మిగతావారు 18 నుంచి 38 సీట్ల మధ్య గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ఏపీలో వైఎస్ఆర్‌సీపీ 24 సీట్లు, తెలంగాణలో బీఆర్ఎస్‌ 9-11 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేసింది.
BJP
Lok Sabha
Congress
BRS
YSRCP

More Telugu News