Rahul Gandhi: రేపు విజయవాడ నుంచి ఖమ్మంకు హెలికాప్టర్ లో చేరుకోనున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi to reach Khammam from Vijayawada
  • రేపు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ
  • పాదయాత్ర చేసిన భట్టిని సత్కరించనున్న రాహుల్
  • రాహుల్ సమక్షంలో పార్టీలో చేరనున్న పొంగులేటి
రేపు ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నారు. విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు రేపు సాయంత్రం ప్రత్యేక విమానంలో ఆయన చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఆయన ఖమ్మంకు బయల్దేరుతారు. సీనియర్ నేత మల్లు భట్టివిక్రమార్క పాదయాత్ర రేపు ఖమ్మంలో ముగియనుంది. పాదయాత్ర ముగింపును పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభలో భట్టిని రాహుల్ గాంధీ సత్కరించనున్నారు. ఇదే సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నారు. సభ అనంతరం రాహుల్ గాంధీ హెలికాప్టర్ లో గన్నవరంకు వెళ్లి... అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.
Rahul Gandhi
Congress
Khammam
Ponguleti Srinivas Reddy

More Telugu News