YS Jagan: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు: సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు

YS Jagan assets case in CBI court
  • జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో పెరిగిన వేగం 
  • ఎనిమిది ఛార్జిషీట్లలో నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లపై ముగిసిన విచారణ
  • మరో మూడు ఛార్జిషీట్లలో డిశ్చార్జ్ పిటిషన్లపై కొనసాగుతున్న విచారణ
ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ శుక్రవారం సీబీఐ కోర్టులో జరిగింది. ఈ సందర్భంగా డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలను వచ్చే నెల 31వ తేదీకి పూర్తి చేయాలని ఆదేశించింది. తద్వారా జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సీబీఐ కోర్టులో వేగవంతమైంది. జగన్ అక్రమాస్తుల కేసుపై టీడీపీ పలుమార్లు ప్రశ్నించింది. ఇతర కేసుల్లో విచారణ త్వరగా జరుగుతున్నప్పటికీ జగన్ ఆస్తుల కేసులో లేదని ఆరోపణలు చేసింది. అయితే ఇప్పుడు ఈ కేసులో వేగం కనిపించడం గమనార్హం.

కాగా, సీబీఐ ఎనిమిది ఛార్జీషీట్లలో నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ ముగిసింది. మరో మూడు ఛార్జీషీట్లలో డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. మరోవైపు, ఈడీ ఏడు ఛార్జీషీట్లలో డిశ్చార్చ్ పిటిషన్లపై విచారణ ముగియగా, మరో 4 ఛార్జీషీట్లలో డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది.
YS Jagan
CBI

More Telugu News