Kethireddy: రాజకీయాల్లోకి వచ్చింది పల్లకీ మోయడానికా?: పవన్ పై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యాఖ్యలు

MLA Kethireddy slams Pawan Kalyan

  • రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గెలుపు కోసం కృషి చేయాలన్న కేతిరెడ్డి
  • హనీ రోజ్ సభకు పవన్ సభల కంటే ఎక్కువమంది వస్తారని వ్యంగ్యం  
  • బాలకృష్ణ తెలివైనవాడు అని వ్యాఖ్య  

జనసేనాని పవన్ కల్యాణ్ పై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. సినిమాలు వేరు, రాజకీయం వేరని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గెలుపు కోసం కృషి చేయాలని, కానీ ఎవరికో పల్లకీ మోయడం ఏంటని అన్నారు.

తిరుపతిలో నటి హనీ రోజ్ మీటింగ్ ఏర్పాటు చేస్తే పవన్ కల్యాణ్ సభల కంటే ఎక్కువ మంది జనం వస్తారని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెల్లడించారు. 

ఇక, ఏ సినిమా నటుడు అయినా మొదటిసారి గెలుస్తారని, రెండోసారి గెలవడం కష్టమని పేర్కొన్నారు. కానీ బాలకృష్ణ చాలా తెలివైనవాడని, హిందూపురంలో పోటీ చేసి గెలుపొందాడని వివరించారు. అదే, బాలకృష్ణ సొంత ఊరిలో పోటీ చేసి ఉంటే ఓడిపోయి ఉండేవాడని తెలిపారు. చిరంజీవి వ్యక్తిగతంగా చాలా మంచివాడని, కానీ పాలకొల్లులో ఓడిపోయారని కేతిరెడ్డి వెల్లడించారు.

  • Loading...

More Telugu News