Klin Kaara: క్లీంకార కొణిదెల... మనవరాలి పేరు వెల్లడించిన చిరంజీవి

  • రామ్ చరణ్-ఉపాసన దంపతుల కుమార్తెకు నేడు బారసాల
  • ఉయ్యాలలో వేసి నామకరణం
  • క్లీంకార అంటే అర్థం చెప్పిన చిరంజీవి
Chirtanjeevi reveals his grand daughter name

పెళ్లయిన పదకొండేళ్లకు రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులయిన సంగతి తెలిసిందే. ఉపాసన జూన్ 20న పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చారు. ఇవాళ ఆ చిన్నారికి బారసాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రామ్ చరణ్, ఉపాసనల కలల పంట అయిన ఆ శిశువును తెలుగు సంప్రదాయాల ప్రకారం ఉయ్యాలలో వేసి నామకరణం కూడా చేశారు. 

దీనికి సంబంధించిన వివరాలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పాప పేరు క్లీంకార కొణిదెల అని వెల్లడించారు. ఈ పేరును లలిత సహస్రనామం నుంచి తీసుకున్నామని తెలిపారు. 

మానవుడిలో ఆధ్యాత్మికతను మేల్కొలిపే స్వచ్ఛమైన శక్తి పరివర్తనను క్లీంకార అనే పేరు సూచిస్తుందని చిరంజీవి వివరించారు. ఈ పేరులోని లక్షణాలను తమ చిన్నారి ఎదిగేకొద్దీ తన వ్యక్తిత్వంలో కచ్చితంగా ప్రతిబింబిస్తుందని నమ్ముతున్నామని పేర్కొన్నారు.

More Telugu News