Sensex: బుల్ జోరు.. సరికొత్త రికార్డులను నెలకొల్పిన స్టాక్ మార్కెట్లు

  • వెల్లువెత్తుతున్న విదేశీ పెట్టుబడులు
  • 803 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 217 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
Stock markets creates New history

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. విదేశీ ఇన్వెస్ట్ మెంట్ల వెల్లువతో పాటు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలు ఉండటం మన మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 803 పాయింట్లు లాభపడి 64,718కి చేరుకుంది. నిఫ్టీ 217 పాయింట్లు పెరిగి 19,189కి ఎగబాకింది. సెన్సెక్స్ ఒకానొక సమయంలో 64,768 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (4.14%), ఇన్ఫోసిస్ (3.21%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.08%), సన్ ఫార్మా (2.84%), టీసీఎస్ (2.67%). 

బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ (-0.33%), ఎన్టీపీసీ (-0.11%) మాత్రమే నష్టపోయాయి.

More Telugu News