Chandrababu: ఇకనైనా మనం మారకపోతే జీవితాలు మారవని వైసీపీ నేతలు గుర్తిస్తున్నారు: చంద్రబాబు

Chandrababu Naidu talks about YCP leaders being joined in TDP
  • జగన్ ముందు బకాసురుడు కూడా తక్కువేనన్న చంద్రబాబు
  • చరిత్రలో ఉన్న రాక్షసులందరినీ మించిన రాక్షసుడు జగన్ అని వ్యాఖ్యలు
  • మార్పు దిశగా వైసీపీ నేతలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ ముందు బకాసురుడు కూడా తక్కువేనని వ్యాఖ్యానించారు. చరిత్రలో ఉన్న రాక్షసులందరినీ మించిన రాక్షసుడు జగన్ అని అభివర్ణించారు. ఇప్పుడైనా మనం మారకపోతే మన జీవితాలు మారవని వైసీపీ నేతలు గుర్తిస్తున్నారని, అందుకే వారు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని చంద్రబాబు వివరించారు.

 వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడితే రాష్ట్రం గెలిచినట్టు భావించాలని, రాష్ట్రం గెలుపు కోసం ప్రతి ఒక్కరూ గ్రామగ్రామానా కష్టపడాలని పిలుపునిచ్చారు. వైసీపీ అరాచక పాలనలో, విశాఖలో ఇప్పుడు అడుగుపెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రారంభానికి ముందే పోలవరాన్ని సుడిగుండంలోకి నెట్టారని, గత టీడీపీ ప్రభుత్వ ఐదేళ్ల కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారని విమర్శించారు.
Chandrababu
TDP
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News