Swiggy: బిర్యానీలు కుమ్మేస్తున్న హైదరాబాదీలు... స్విగ్గీలో గత ఆర్నెల్లలో 72 లక్షల బిర్యానీల ఆర్డర్!

  • వరల్డ్ బిర్యానీ డే నేపథ్యంలో ఆసక్తికర గణాంకాలు వెల్లడించిన స్విగ్గీ
  • గత 12 నెలల్లో 1.52 కోట్ల బిర్యానీ ఆర్డర్లు
  • హైదరాబాదులో 15 వేల రెస్టారెంట్లలో బిర్యానీ తయారీ
  • గతేడాదితో పోల్చితే బిర్యానీ ఆర్డర్లలో 8.39 శాతం వృద్ధి
Swiggy about Biryani orders in Hyderabad

హైదరాబాద్ అంటే టక్కున గుర్తొచ్చేది బిర్యానీయే. దమ్ బిర్యానీకి కేరాఫ్ అడ్రస్ లాంటి హైదరాబాద్ లో 15 వేల రెస్టారెంట్లు వివిధ రకాల బిర్యానీలు వండి వడ్డిస్తున్నాయి. చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, ఫిష్, రొయ్యలు, మష్రూమ్స్, మొఘలాయి, కశ్మీరీ... ఇలా ఎన్నో రకాల బిర్యానీలతో హైదరాబాద్ పేరు ప్రపంచపటంలో నిలిచిపోతుంది. 

ఇక, ప్రపంచ బిర్యానీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఫుడ్ ఆర్డర్ పోర్టల్ స్విగ్గీ ఆసక్తికర గణాంకాలు వెల్లడించింది. బిర్యానీలు లాగించడంలో హైదరాబాదీల తర్వాతే ఎవరైనా అని తెలిపింది. గత ఆర్నెల్లలో హైదరాబాదులో 72 లక్షల బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయట. గత 12 నెలల్లో 1.52 కోట్ల బిర్యానీలు కుమ్మేశారట. 

2022తో పోల్చితే గత ఐదు నెలల్లో బిర్యానీ ఆర్డర్ల సంఖ్యలో 8.39 శాతం వృద్ధి నమోదైందని స్విగ్గీ వివరించింది. 

7.9 లక్షల ఆర్డర్లతో దమ్ బిర్యానీ అగ్రస్థానంలో ఉండగా, 5.2 లక్షల ఆర్డర్లతో మినీ బిర్యానీ రెండో స్థానంలో ఉందని తెలిపింది.

More Telugu News