Congress: తెలంగాణ కాంగ్రెస్ లో ఖమ్మం జోష్.. భట్టి సభపై భారీ అంచనాలు

  • ఆదివారం భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు, చేరికల సభ
  • పార్టీలో చేరనున్న పొంగులేటి, జూపల్లి, ఇతర నేతలు
  • భట్టి పాదయాత్ర శిబిరానికి వచ్చిన రేవంత్ రెడ్డి
Huge expectations on Bhatti Sabha in khammam

తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 109 రోజుల పాటు మండుటెండల్లో 1300 కిమీ నడిచిన భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అధిష్ఠానం పెద్దల దృష్టిని కూడా ఆకర్షించింది. దాంతో, ఖమ్మంలో ఆదివారం సాయంత్రం జరిగే పాదయాత్ర ముగింపు సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సభ వేదికగా పార్టీలో ముఖ్య నేతల చేరికలు జరగనున్నాయి. తాజా పరిణామాల నడుమ సెంట్రల్ టీమ్స్ రంగంలోకి దిగి మేధావులతో భేటీలు నిర్వహిస్తున్నాయి. 

సభ సక్సెస్ అవ్వటం ఖాయమని గ్రహించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. ఖమ్మం సభ ఏర్పాట్ల పై పర్యవేక్షణకు రంగంలోకి దిగారు. శుక్రవారం భట్టి పాదయాత్ర శిబిరానికి వచ్చారు. సభ ఏర్పాట్లు, నిర్వహణపై భట్టి, ఇతర ముఖ్య నేతలతో ఆయన చర్చించారు. దాదాపు ఐదు లక్షల మంది హాజరయ్యే సభను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఖమ్మం సభ నుంచే రాహుల్ గాంధీ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. భట్టి పాదయాత్ర నాలుగు కోట్ల మంది ప్రజలను మేల్కొలిపిందన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సాగిన ఈ పాదయాత్రలో పరిశీలించిన అంశాలు, ఫీడ్ బ్యాక్ తో అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మేనిఫెస్టో ఉంటుందని తెలిపారు.

More Telugu News