Vande Bharat: వందేభారత్‌ రైళ్లలో నెం.1 ఇదే!

  • ప్రజాదరణ చూరగొంటున్న వందేభారత్ రైళ్లు
  • 183 % ఓఆర్‌తో దేశంలోనే నెం.1గా నిలిచిన కాసర్‌గోడ్-తిరువనంతపురం సర్వీసు
  • ఆ తరువాతి స్థానంలో తిరువనంతపురం-కాసర్‌గోడ్ సర్వీసు
  • ప్రకటించిన రైల్వే శాఖ
Kasargod thiruvananthapuram vandebharat reach top spot with 183 percent occupancy ratio

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందేభారత్ రైలు సర్వీసులకు ప్రజల్లో మంచి స్పందన వస్తున్న విషయం తెలిసిందే. వేగవంతమైన ప్రయాణం, అద్భుతమైన వసతులు వెరసి ఈ రైళ్లకు ప్రజాదరణ దక్కింది. ప్రస్తుతం దేశంలో 23 జతల వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. 

అయితే, వీటిల్లో అత్యధిక ప్రజాదరణ పొందిన సర్వీసు కేరళలోని కాసర్‌గోడ్-తిరువనంతపురం వందేభారత్‌ అని రైల్వే వర్గాలు తాజాగా ప్రకటించాయి. ఏకంగా 183 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో(ఓఆర్) ఈ రైలు వందేభారత్ సర్వీసులన్నిటికంటే ముందు నిలిచింది. ఆ తరువాత 176 % ఆక్యుపెన్సీ రేషియోతో తిరువనంతపురం-కాసర్‌గోడ్ రైలు సర్వీసు రెండో స్థానంలో నిలిచింది. గాంధీనగర్-ముంబై సెంట్రల్(134%), ముంబై సెంట్రల్-గాంధీనగర్(129%), రాంచీ-పాట్నా(127%), న్యూఢిల్లీ-వారణాసి(124%), ముంబై- షోలాపూర్(111%), డెహ్రాడూన్-అమృత్‌సర్(105%) వందేభారత్ రైళ్లు ఆ తరువాతి స్థానాల్లో వరుసగా నిలిచాయని రైల్వే శాఖ ప్రకటించింది.

More Telugu News