Ambati Rambabu: సినిమాల్లో కథానాయకుడు, రాజకీయాల్లో కంత్రీ నాయకుడు: అంబటి రాంబాబు

  • రాజకీయాల్లో డబ్బింగ్ చెప్పే స్థాయికి పవన్ దిగజారాడన్న అంబటి
  • వారాహి యాత్రను ఆపేసి డబ్బింగ్ చెప్పుకుంటున్నాడని విమర్శ
  • లోకేశ్ కు అసలు గళమే లేదని ఎద్దేవా
Ambati Rambabu fires on Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్ స్థిరత్వంలేని వ్యక్తి అని విమర్శించారు. సినిమాల్లో కథానాయకుడు, రాజకీయాల్లో కంత్రీ నాయకుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో డబ్బింగ్ చెప్పే స్థాయికి పవన్ దిగజారిపోయాడని అన్నారు. 

ఎన్నికలప్పుడే పవన్, చంద్రబాబులకు ఏపీ గుర్తుకొస్తుందని... ఎన్నికల సమయంలో చలో ఏపీ, ఎన్నికలు ముగిశాక చలో హైదరాబాద్ అని ఎద్దేవా చేశారు. జగన్ పోవాలి అని చెపుతున్న పవన్ కల్యాణ్... ఎవరు రావాలో మాత్రం చెప్పడం లేదని అన్నారు. జ్వరం వచ్చిందని వారాహి యాత్రను ఆపేసి.. తన కార్యాలయంలో సినిమాకు డబ్బింగ్ చెప్పుకుంటున్నారని విమర్శించారు. యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్ కు అసలు గళమే లేదని అన్నారు. జగన్ ప్రభుత్వం పోతే రాష్ట్రంలోని సంక్షేమ పథకాలన్నీ పోతాయని చెప్పారు.

More Telugu News