India: నేనైతే ఎక్కువ డబ్బులు అడిగేవాడిని: భారత్-పాక్ మ్యాచ్‌పై క్రిస్ గేల్

  • భారత్-పాక్ మ్యాచ్ పైసా వసూల్ గేమ్ అన్న విండీస్ ప్లేయర్
  • ఈ రెండు జట్ల ద్వారా ఐసీసీ ఈవెంట్ ఖర్చు వెళ్లిపోతుందని వ్యాఖ్య
  • పాక్, భారత ఆటగాళ్లు అధిక డబ్బులు డిమాండ్ చేయాలని సూచన
India Pakistan Players Should Demand Lot Of Money says Chris Gayle

ప్రపంచ కప్ లో భాగంగా జరగనున్న భారత్ - పాక్ మ్యాచ్‌పై విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠను కలిగిస్తుందని, దాయాదుల మధ్య పోరు ఫైనల్‌లా ఉంటుందన్నాడు. ఇది క్రేజీ, పైసా వసూల్ గేమ్ అన్నాడు. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో గేల్ మాట్లాడుతూ... భారత్, ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్‌లను నాలుగింటిని సెమీ ఫైనలిస్ట్ జాబితాకు ఎంచుకున్నాడు. ఇందులో భాగంగా అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో ఇండో-పాక్ పోరు ఉంది. దీనిపై గేల్ స్పందించాడు.

ఈ రెండు జట్లు ఆడినప్పుడల్లా.. ముఖ్యంగా ప్రపంచ కప్ లో వారి ఆదాయం ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. ఈ ఒక్క గేమ్ ద్వారా ఐసీసీ ఈవెంట్ కు అయ్యే ఖర్చు వస్తుందన్నాడు. పాక్, భారత్ ఆటగాళ్లు ఎక్కువ డబ్బును డిమాండ్ చేయాలని, ఎందుకంటే ఆ గేమ్ ల ద్వారా అధిక ఆదాయం వస్తుందన్నాడు. తాను ఐసీసీ లేదా ఆ దేశానికి సంబంధించిన బోర్డును నియంత్రించనని, కాని పాక్, భారత ఆటగాళ్ల స్థానంలో తాను ఉంటే అధిక డబ్బులు డిమాండ్ చేస్తానని నవ్వుతూ చెప్పాడు.

భారత్ తో పాటు విండీస్ చాలాకాలంగా ఐసీసీ ట్రోఫీని గెలవలేదని, తాము చివరగా 2016లో గెలిచామని గుర్తు చేసుకున్నాడు. అయితే స్వదేశంలో ఆడుతున్నందున భారత్ ఫేవరేట్ గా చెప్పాడు.

More Telugu News