gold prices: గుడ్‌న్యూస్... తగ్గుతున్న బంగారం ధరలు

  • బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం
  • రూ.58,080 వద్ద ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్ 
  • హైదరాబాద్‌లో పసిడి ధర రూ.58,750
Gold and Silver prices in India on 29 June

బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం పసిడి ధరలు ఆకాశాన్ని అంటాయి. కానీ తాజాగా తగ్గుతూ వస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా క్షీణించాయి. కొన్ని రోజుల క్రితం 10 గ్రాముల పసిడి ధర రూ.63,000 క్రాస్ చేసింది. ఇప్పుడు రూ.58,000 స్థాయికి దిగి వచ్చాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్ రూ.58,080 వద్ద ఉంది.
  
రాయిటర్స్ నివేదిక ప్రకారం బలమైన డాలర్ విలువ, అమెరికా ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు బులియన్ మార్కెట్ ను ప్రభావితం చేస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్ లో పది గ్రాముల బంగారం ధర రూ.59,050కి, కిలో వెండి ధర రూ.350 క్షీణించి రూ.71,250కి పడిపోయింది. గత ట్రేడింగ్ సెషన్ లో పది గ్రాముల పసిడి ధర రూ.59,350 వద్ద ముగిసింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.210 తగ్గి రూ.58,750, 22 క్యారెట్ల పసిడి రూ.200 తగ్గి రూ.53,850గా ఉంది.

More Telugu News