Bengaluru: ట్రాఫిక్​కు చెక్ పెట్టేందుకు బెంగళూరులో 65 కి.మీ సొరంగ రోడ్డు మార్గం!

  • నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన కర్ణాటక ప్రభుత్వం
  • సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరి
  • అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో ముందున్న బెంగళూరు
65 km of tunnel to come up in Bangalore

దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన నగరారం బెంగళూరులో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు 65 కిలో మీటర్ల మేర సొరంగ మార్గం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికి అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు కేంద్ర భూ ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరితో కర్ణాటక ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్‌ జార్కిహొళి బృందం భేటీ అయింది.

 బెంగళూరులో ట్రాఫిక్‌ తీవ్రమైన సమస్యగా మారుతోందని, ఫ్లై ఓవర్లు, రోడ్ల వెడల్పుతో సాధ్యం కావడం లేదని ప్రత్యామ్నాయమైన సొరంగ మార్గం నిర్మించాలని భావిస్తున్నట్టు కేంద్ర మంత్రికి వివరించినట్టు సతీశ్ తెలిపారు. ప్రస్తుతం మెట్రో సొరంగ మార్గం పలు చోట్ల ఉందని, అదే తరహాలో రోడ్డు మార్గాలకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. పీణ్యా-హెబ్బాళ, కేఆర్‌ పురం - హోసూరు మార్గాల్లో సొరంగం ఏర్పాటు చేయాల్సి ఉందని వివరించారు. మంగళూరు జాతీయ రహదారి శిరాడిఘాట్‌ వద్ద సొరంగ మార్గానికి కూడా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.

More Telugu News