Nadendla Manohar: జగన్ వంటి మేనమామ ఏ ఇంట్లో ఉన్నా తన్ని పంపిస్తారు: నాదెండ్ల మనోహర్

Nadendla Manohar take a swipe at CM Jagan
  • రాష్ట్రంలోని పిల్లలందరికీ మేనమామలా అండగా ఉంటానన్న సీఎం జగన్
  • ఇలాంటి మేనమామ ఏ కుటుంబంలో ఉండకూడదన్న నాదెండ్ల
  • ప్రభుత్వ కార్యక్రమంలో, పిల్లల వద్దకు వెళ్లి ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తి అని విమర్శలు
రాష్ట్రంలోని పిల్లలందరికీ మేనమామలా అండగా ఉంటానని సీఎం జగన్ చెప్పుకోవడం పట్ల జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఏ కుటుంబంలో కూడా జగన్ వంటి మేనమామ ఉండకూడదని అన్నారు. అటువంటి మేనమామ ఏ ఇంట్లో ఉన్నా తన్ని పంపిస్తారని వ్యాఖ్యానించారు. 

ఒక ప్రభుత్వ కార్యక్రమంలో, పిల్లల వద్దకు వెళ్లి ఎలా మాట్లాడాలో కూడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని వ్యక్తిగత, రాజకీయ విమర్శలకు ఉపయోగించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. జగన్ వంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవాలంటేనే సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.
Nadendla Manohar
Jagan
Janasena
YSRCP

More Telugu News