Pawan Kalyan: సీఎం జగన్ ను అనుకరిస్తూ పవన్ ఫన్నీ కామెంట్స్... వీడియో ఇదిగో!

Pawan Kalyan imitates CM Jagan in a funny way
  • కురుపాంలో అమ్మఒడి సభ
  • పవన్ ఊగిపోతా మాట్లాడుతుంటాడన్న సీఎం జగన్
  • ముఖ్యమంత్రి గారు బాధపడిపోతున్నారంటూ పవన్ వ్యాఖ్యలు
  • వీడియో పంచుకున్న జనసేన పార్టీ
ఇవాళ కురుపాంలో జరిగిన అమ్మఒడి సభలో సీఎం జగన్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను విమర్శించడం తెలిసిందే. పవన్ వారాహి ఎక్కి ఊగిపోతూ ఆవేశంతో మాట్లాడుతుంటాడని అన్నారు. దీనిపై  పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. 

"నేను ఊగిపోతా మాట్లాడుతున్నానని ఆయన బాధపడిపోతున్నారు. సరే ఓ పనిచేస్తాను ముఖ్యమంత్రి గారూ. రేపటి నుంచి ఇలా... ఇలా... ఇలా మాట్లాడతాను... అది ఓకేనా!" అంటూ సీఎం జగన్ ను అనుకరించారు. 

ఇక నుంచి తాను పాత పద్ధతిలో మాట్లాడనని, ఇక నుంచి కొత్త పద్ధతిలో మాట్లాడతానని వ్యంగ్యం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి గారికి ఇది ఓకేనా  కనుక్కుందాం అని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.
Pawan Kalyan
Jagan
Imitation
Janasena
YSRCP

More Telugu News