తిరుమలలో బాగా తగ్గిన భక్తుల రద్దీ... నేరుగా శ్రీవారి దర్శనం
- దేశవ్యాప్తంగా వర్షాలు
- మొదలైన విద్యా సంవత్సరం
- తిరుమలలో సాధారణ రద్దీ
- టోకెన్ లేకుండా వెళ్లిన భక్తులకు 4 గంటల్లోనే దర్శనం
టోకెన్ లేకుండా వెళ్లిన భక్తులు కూడా కేవలం 4 గంటల్లోనే స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఉన్నవారు 3 గంటల్లోనే దర్శనం పూర్తి చేసుకుంటున్నారు.
నిన్న తిరుమల వెంకన్నను 69,143 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,145 మంది తలనీలాల మొక్కు తీర్చుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.4.38 కోట్ల ఆదాయం లభించింది.