Etela Rajender: ప్రగతి భవన్ నుంచే నా హత్యకు కుట్ర జరుగుతోంది: ఈటల రాజేందర్

There is a conspiracy to kill me from Pragathi Bhavan says Etela Rajender
  • సుపారీ ఇచ్చి చంపించేందుకు కుట్ర చేస్తున్నారన్న ఈటల
  • ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఒక సైకో అని విమర్శ
  • కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్
బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ నుంచే తన హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ విషయం తనకు బీఆర్ఎస్ నేతల నుంచే తెలిసిందని చెప్పారు. సుపారీ ఇచ్చి తనను చంపించేందుకు యత్నిస్తున్నారని అన్నారు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఒక సైకో అని, శాడిస్ట్ అని, తనతో పాటు బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఆయనపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక సైకోను కేసీఆర్ ఎమ్మెల్సీగా నియమించారని దుయ్యబట్టారు. తన భద్రతను నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలే చూసుకుంటారని అన్నారు.
Etela Rajender
BJP
Murder
Pragathi Bhavan
Kaushik Reddy
BRS

More Telugu News