Asin: భర్తతో విడిపోలేదు.. విహార యాత్రలో ఉన్నా: నటి అసిన్

Not divorced Asin is on a holiday with Rahul Sharma calls rumours disappointing
  • 2016లో వ్యాపారవేత్త రాహుల్ శర్మను పెళ్లి చేసుకున్న హీరోయిన్
  • ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఫొటోలను డిలీట్ చేయడంతో విడాకులు తీసుకుంటుందంటూ వార్తలు
  • అవన్నీ పుకార్లే అని కొట్టిపారేసిన అసిన్
అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రంతో టాలీవుడ్‌ కు పరిచయమైన కేరళ నటి అసిన్. కొన్నాళ్లు తెలుగులో బిజీగా ఉన్న ఆమె తర్వాత బాలీవుడ్ కు సైతం వెళ్లింది. కెరీర్ బాగున్న సమయంలోనే బడా వ్యాపారవేత్త, మైక్రోమ్యాక్స్ అధినేత రాహుల్ శర్మను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె నటనకు దూరమైంది. 2016లో పెళ్లైనప్పటి నుంచి అసిన్ బయట ఎక్కువగా కనిపించలేదు. తాజాగా  తన ఇన్‌స్టాగ్రామ్‌లో భర్త ఫోటోలు డిలీట్ చేసి వార్తల్లో  నిలిచింది. భర్త రాహుల్ తో ఆమెకు పడటం లేదని, ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని, అందుకే ఫొటోలను డిలీట్ చేసిందంటూ పుకార్లు  మొదలయ్యాయి. 

ఈ విషయమై అసిన్ స్పందించింది. అవన్నీ పుకార్లే అని తెలిపింది. భర్తతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. తాను భర్తతో కలిసి విహార యాత్రలో ఉన్నానని చెప్పింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పేస్ కోసమే ఫొటోలను డిలీట్ చేసినట్లు స్పష్టం చేసింది. గతంలో తమ పెళ్లి ముంగిట కూడా ఇద్దరం బ్రేకప్ అయినట్టు ఇలానే పుకార్లు వచ్చాయని తెలిపింది. ఇప్పుడు విడాకులకు స్పందించేందుకు ఐదు నిమిషాల సమయం వృథా చేసినందుకు బాధగా ఉందని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
Asin
Bollywood
Tollywood
divorce
rumours
marriage

More Telugu News