Varun Tej: షూటింగ్ పార్టు పూర్తిచేసుకున్న అర్జునుడు!

  • 'గాండీవధారి అర్జున'గా వరుణ్ తేజ్ 
  • ఆయన సరసన అలరించనున్న సాక్షి వైద్య
  • ప్రవీణ్ సత్తారు మార్కు యాక్షన్ సినిమా ఇది 
  • ఆగస్టు 25వ తేదీన సినిమా విడుదల

Gandeevadhari Arjuna Movie Update

వరుణ్ తేజ్ హీరోగా 'గాండీవధారి అర్జున' సినిమా రూపొందుతోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమాను ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నారు. 

ప్రవీణ్ సత్తారు అనగానే యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయనే విషయం ఆడియన్స్ కి అర్థమైపోతుంది. ఇక ఈ టైటిల్ చూస్తుంటేనే యాక్షన్ ఎపిసోడ్స్ ఒక రేంజ్ లో ఉంటాయనే విషయం తెలుస్తోంది. వరుణ్ తేజ్ ఈ సినిమాలో చాలా స్టైలీష్ గా కనిపించనున్నాడు. యాక్షన్ సీక్వెన్స్ కూడా అలాగే ఉంటాయని అంటున్నారు.

వరుణ్ తేజ్ జోడీగా ఈ సినిమాలో సాక్షి శివ కనిపించనుంది. 'ఏజెంట్' తరువాత ఆమె చేస్తున్న సినిమా ఇదే. మిక్కీ జె.మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ప్రవీణ్ సత్తారు యాక్షన్ మార్కులో వరుణ్ తేజ్ ఎలా చెలరేగిపోతాడో చూడాలి మరి. 

More Telugu News