Venkatesh Daggubati: 'సైంధవ్'ను దాటి వెళ్లలేని విలన్ గ్యాంగ్: షూటింగ్ అప్ డేట్!

Saindhav Movie Update

  • వెంకీ తాజా చిత్రంగా 'సైంధవ్' 
  • పోస్టర్స్ తోనే ఆసక్తిని పెంచిన సినిమా 
  • ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ మూవీ 
  • ప్రతినాయకుడిగా నవాజుద్దీన్ సిద్ధికీ


వెంకటేశ్ కథానాయకుడిగా 'సైంధవ్' సినిమా రూపొందుతోంది. శైలేశ్ కొలను దర్శకత్వంలో ఈ సినిమాను వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నాడు. ఇది ఎమోషన్స్ తో కూడిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్. పోస్టర్స్ తోనే ఈ సినిమా అందరిలో ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ఇక వెంకటేశ్ యాక్షన్ స్టిల్స్ కూడా ఆసక్తిని రేకెత్తించాయి. ఆయన చేతిలోని వెపన్స్ చూస్తే, ఆయనను దాటి విలన్ గ్యాంగ్ వెళ్లలేదనే విషయం అర్థమవుతోంది.  

ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్, కథానాయికగా నటిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ వలన బయటికి వచ్చింది. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగు హైదరాబాదులో జరిగిందనీ, సక్సెస్ ఫుల్ గా ఈ షెడ్యూల్ ను పూర్తి చేయడం జరిగిందని అంది. దాంతో ఈ సినిమా టీమ్ మూడో షెడ్యూల్ కి రెడీ అవుతుందనే విషయం అర్థమవుతోంది.

సంతోష్ నారాయణ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. నవాజుద్దీన్ సిద్ధికీ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో, రుహాని శర్మ .. ఆండ్రియా ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. 

More Telugu News