ఈటల రాజేందర్ భద్రతపై డీజీపీకి ఫోన్ చేసిన కేటీఆర్
- తనను హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్న ఈటల
- ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్ తో వెరిఫై చేయించాలన్న కేటీఆర్
- అవసరమైనంత సెక్యూరిటీని కల్పించాలని డీజీపీకి సూచన
రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ కు ఫోన్ చేసి ఈటల భద్రతపై కేటీఆర్ చర్చించారు. ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్ అధికారితో వెరిఫై చేయించాలని సూచించారు. రాష్ట్ర పోలీసు బలగాలతో ఈటలకు అవసరమైనంత సెక్యూరిటీని కల్పించాలని చెప్పారు. కేటీఆర్ ఆదేశాల మేరకు ఈటల భద్రత పెంపుకు సంబంధించి ఈరోజు డీజీపీ సమీక్ష చేయనున్నారు. కాసేపట్లో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఈటల నివాసానికి వెళ్లనున్నారు. తన భర్తకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డితో ప్రాణ హాని ఉందంటూ ఈటల భార్య కూడా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.