Hari Rama Jogaiah: కేసుల్లో మీరు దోషిగా తేలితే మీ తర్వాత సీఎం ఎవరు?: సీఎం జగన్ కు హరిరామజోగయ్య లేఖ

  • సీఎం జగన్ పై సీబీఐ, ఈడీ కేసులు
  • కోర్టులో కొనసాగుతున్న విచారణ
  • విచారణ పూర్తయి మీరు అరెస్టయితే పరిస్థితి ఏంటన్న హరిరామజోగయ్య
  • సీఎం పీఠాన్ని రెడ్లకు ఇస్తారా, కాపులకు ఇస్తారా? అంటూ  లేఖ 
  • కాపులకు ఇస్తే గర్వపడతామని వెల్లడి
Hari Rama Jogaiah wrote CM Jagan

కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. మీపై అనేక కేసుల్లో విచారణ జరుగుతోంది... ఒకవేళ మీరు దోషిగా తేలితే అయితే మీ తర్వాత సీఎం ఎవరు? అంటూ తన లేఖలో ప్రశ్నించారు. 

"మీపై సీబీఐ, ఈడీ సంస్థలు క్విడ్ ప్రో కో, మనీలాండరింగ్ అభియోగాలతో కేసులు నమోదు చేశాయి... ఈ కేసుల్లో మీరు 16 నెలలు జైలులో కూడా ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ పై బయటికి వచ్చారు. కానీ ఇప్పటికీ ఆ కేసులకు సంబంధించి కోర్టులో విచారణ జరుగుతోంది. విచారణ అనంతరం మిమ్మల్ని ఏ కారణం చేతనైనా కోర్టు దోషిగా ప్రకటిస్తే మీరు రాజీనామా చేయాల్సి ఉంటుంది. 

అలాంటి పరిస్థితే వస్తే మీ తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టేది ఎవరు? సీఎం పీఠాన్ని రెడ్డి కులస్తులకు ఇస్తారా, లేక కాపు కులస్తులకు ఇస్తారా? అనేది చెప్పాలి. బడుగు బలహీన వర్గాలపై మీ కమిట్ మెంట్ ఏంటనేది దీంతో స్పష్టంగా వెల్లడవుతుంది. మీరు బడుగు బలహీనవర్గాల వైపు మొగ్గితే మేం గర్వపడతాం. ఈ విషయాన్ని ప్రజలకు ఓ బహిరంగ ప్రకటన ద్వారా తెలియజేయండి" అంటూ సీఎం జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

More Telugu News