Alla Nani: ఓర్పుతో ఉన్నాం.. చేతకానితనం కాదు: పవన్ కల్యాణ్‌కు ఆళ్ల నాని గట్టి హెచ్చరిక

Alla Nani warning to Janasena chief Pawan Kalyan
  • జగన్ ను దూషించడానికే యాత్రను చేపట్టారని ఆగ్రహం
  • కులాల మధ్య చిచ్చుపెట్టేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజం
  • జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆళ్ల నాని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దూషించడానికే పవన్ వారాహి యాత్రను ప్రారంభించినట్లుగా ఉందని మండిపడ్డారు. తాము ఓర్పుతో ఉన్నామని, కానీ దీనిని చేతకానితనంగా భావించవద్దని హెచ్చరించారు. ఇప్పటికీ తాము సంయమనంతోనే ఉన్నామని చెప్పారు.

కులాల మధ్య చిచ్చుపెట్టేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని దుయ్యబట్టారు. దేవుళ్లను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లోను వైసీపీయే గెలుస్తుందని, జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. వాహనానికి అమ్మవారి పేరు పెట్టి రాజకీయం చేస్తున్నారన్నారు. జగన్ ను తిట్టేందుకు, చంద్రబాబును సీఎం చేసేందుకు యాత్ర చేస్తున్నారని ఆరోపించారు.
Alla Nani
Pawan Kalyan

More Telugu News