Amaravati: కేంద్రమంత్రి హర్ దీప్ సింగ్ కు అమరావతి రైతుల లేఖ

  • ఇతర ప్రాంతాల పేదల కోసం అమరావతిలో ఆర్-5 జోన్
  • వ్యతిరేకిస్తున్న రైతులు
  • ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధుల విడుదలపై రైతుల అభ్యంతరం
  • కోర్టుల్లో కేసు తేలేవరకు నిధులు నిలిపివేయాలని కేంద్రానికి విజ్ఞప్తి
Amaravathi farmers wrote union minster Hardeep Singh Puri

కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీకి అమరావతి రైతులు లేఖ రాశారు. ఆర్-5 జోన్ లో ఇళ్ల కోసం కేంద్రం నిధుల విడుదలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్-5 జోన్ పై కోర్టుల్లో కేసు తేలే వరకూ కేంద్ర నిధులను నిలుపుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని, కేంద్రం తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా నిర్మించాలని స్పష్టం చేశారు. 

అమరావతిలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్లు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ గతంలో రైతులు ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా హైకోర్టు తీర్పు వెలువరించింది. దాంతో హైకోర్టు తీర్పును అమరావతి రైతులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 

అయితే, ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, మార్గం సుగమం కావడంతో ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది

More Telugu News