Modi Vs KCR: కేసీఆర్ కుటుంబంపై మోదీ డైరెక్ట్ అటాక్

Modi direct attack on KCR family
  • కేసీఆర్ కూతురుకు మేలు చేయాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలన్న మోదీ
  • మీ కుటుంబ సభ్యులకు మేలు జరగాలంటే బీజేపీకి ఓటు వేయాలని వ్యాఖ్య
  • భోపాల్ సభలో కేసీఆర్ ను టార్గెట్ చేసిన మోదీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కూతురు కవితకు లాభం చేయాలనుకుంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని, మీ కుటుంబ సభ్యులకు మంచి జరగాలంటే బీజేపీకి ఓటు వేయాలని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 

ఈ నేపథ్యంలో భోపాల్ లో నిర్వహించిన ఐదు రాష్ట్రాల బూత్ కమిటీల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. మరోవైపు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ విపక్షాలు విమర్శిస్తున్న తరుణంలో మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Modi Vs KCR
Narendra Modi
BJP
KCR
K Kavitha
BRS

More Telugu News