Congress: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ కమిటీ భేటీ: ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు

Kharge and Rahul Gandhi in Telangana Congress election strategy meet
  • వ్యూహ కమిటీ భేటీలో ఖర్గే, రాహుల్ తో పాటు ఠాక్రే
  • తెలంగాణ నాయకులకు, సీనియర్లకు దిశా నిర్దేశనం
  • పదిహేనుమందికి మాత్రమే పిలుపు
ఢిల్లీలో పార్టీ జాతీయ నాయకులతో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత, మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేలు పాల్గొన్నారు. ఈ భేటీకి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, జానారెడ్డి, మధుయాష్కీ గౌడ్ తదితరులు హాజరయ్యారు. వ్యూహ కమిటీ సభ్యులు.. తెలంగాణ నాయకులకు, పార్టీ సీనియర్ నేతలకు దిశానిర్దేశనం చేస్తారు.

కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశానికి పదిహేను మందికి మాత్రమే ఆహ్వానం అందింది. ఇందులో ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఉన్నారు. తమను ఆహ్వానించకపోవడంపై పలువురు నేతలు ఆసంతృప్తితో ఉన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో, ఎన్నికల వ్యూహాలపై ప్రధానంగా చర్చ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
Congress
Rahul Gandhi
Revanth Reddy
Telangana

More Telugu News