viral vedio: ఒకే స్కూటర్ పై 8 మంది ప్రయాణం.. కేసు నమోదు

Mumbai man rides scooter with 7 children arrested
  • ఏడుగురు పిల్లలను ఎక్కించుకుని స్కూల్ కు తీసుకెళుతున్న వ్యక్తి
  • ముంబైలో కనిపించిన దృశ్యం
  • సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఒక ద్విచక్ర వాహనంపై ఇద్దరికి మించి ప్రయాణించేందుకు చట్ట పరంగా అనుమతి లేదు. ఇద్దరు కూడా విధిగా హెల్మెట్లు ధరించాలని చట్టంలోని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ముంబైకి చెందిన ఓ వ్యక్తి తనకు నిబంధనలు ఏవీ వర్తించవన్నట్టు వ్యవహరించాడు. తన స్కూటర్ పై ఏకంగా ఏడుగురు పిల్లలను ఎక్కించుకుని స్కూల్ కు తీసుకెళ్లాడు. ఇది కెమెరాలకు చిక్కి సామాజిక మాధ్యమాల్లోకి చేరడంతో వైరల్ గా మారింది. 

సంబంధిత వ్యక్తిని మునావర్ షాగా పోలీసులు గుర్తించారు. ఈ వీడియో ఆధారంగా అతడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. స్కూటర్ ను సీజ్ చేశారు. స్కూటర్ పై అంతమంది ఎలా పట్టారన్న సందేహం రావచ్చు. స్కూటర్ ముందు భాగంలో ఇద్దరు పిల్లలు కూర్చున్నారు. సీటు వెనుక ముగ్గురు కూర్చున్నారు. మరో ఇద్దరు స్కూటర్ వెనుక, పక్కన క్రాష్ గార్డ్ పై నించున్నారు. పొరపాటున ఏదైనా ప్రమాదం వాటిల్లితే జరిగే నష్టం భారీగా ఉంటుందన్న స్పృహ కూడా లేకుండా ఇలా చేయడం చూసే వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. రైడర్ తనతోపాటు స్కూటర్ పై ఉన్న మిగిలిన అందరి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేశాడని, దీన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తున్నట్టు ముంబై పోలీసులు పేర్కొన్నారు.
viral vedio
Mumbai man
rides scooter
7 children

More Telugu News