పదవీ విరమణ రోజున 65 తీర్పులు వెలువరించిన న్యాయమూర్తి
- ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ ముక్తా గుప్తా రికార్డు
- ఒకదాని వెంట ఒకటి వేగంగా విచారణ, తీర్పులు
- సందడిగా మారిన కోర్టు ప్రాంగణం
హైకోర్టు జడ్జిగా 14 ఏళ్లపాటు జస్టిస్ ముక్తా గుప్తా సేవలు అందించారు. చివరికి మంగళవారం రిటైర్మెంట్ తీసుకున్నారు. దీంతో సోమవారం ఢిల్లీ హైకోర్టు అత్యంత సందడిగా, రద్దీగా మారిపోయింది. ఒకే రోజు భారీ సంఖ్యలో కేసులు విచారణకు రావడంతో న్యాయవాదులు, కేసుల్లో నిందితులు, సాక్షులతో కోర్టు ప్రాంగణంలో సందడి నెలకొంది.