Janasena Youtube Channel: సరికొత్త చరిత్ర సృష్టించిన జనసేన యూట్యూబ్ ఛానల్

Janasena Youtube Channel hits 1 million subscribers
  • 10 లక్షల మంది సబ్ స్క్రైబర్లను సొంతం చేసుకున్న జనసేన యూట్యూబ్ ఛానల్
  • ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేసిన జనసేన
  • సబ్ స్క్రైబర్లకు ధన్యవాదాలు తెలిపిన వైనం 
జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ చరిత్రను సృష్టించింది. 10 లక్షల మంది సబ్ స్క్రైబర్లను ఈ యూట్యూబ్ ఛానల్ సాధించింది. ఈ విషయాన్ని జనసేన అధికారికంగా ప్రకటించింది. 10 లక్షల మంది సబ్ స్క్రైబర్లను చేరుకున్న జనసేన అధికారిక యూట్యూబ్ ఛానల్ అని ట్విట్టర్ ద్వారా తెలిపింది. పార్టీకి మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు చెప్పింది. మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఈరోజు భీమవరంలో కొనసాగనుంది. నియోజకవర్గంలోని ముఖ్యనేతలతో పవన్ సమావేశాన్ని నిర్వహించి, మార్గనిర్దేశం చేయబోతున్నారు.
Janasena Youtube Channel
10 Laks Subscribers
Pawan Kalyan

More Telugu News